RRR ప్రీమియర్‌ షో లు ముందుగానే…క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

RRR ప్రీమియర్‌ షో లు ముందుగానే…క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Published on Mar 15, 2022 2:40 PM IST

RRR ఈ నెల 25న విడుదల కానుండగా, ఈ సినిమాపై క్రేజీ బజ్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని, ప్రీమియర్ షోల గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై రాజమౌళిని అడిగగా, “ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతినిచ్చింది, తెలంగాణలోనూ అదే ఉంది. ప్రీమియర్స్‌కి ఒకరోజు ముందే అనుమతులు తీసుకుంటున్నాం, డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలో నిర్ణయిస్తారు. మేం ప్రారంభ ప్రీమియర్‌లకు అనుకూలంగా” అంటూ చెప్పుకొచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు