మహేష్ – త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ అదేనా ?

Published on Nov 29, 2022 12:11 am IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే, కృష్ణ గారి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11, 2023 న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మహేష్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :