అభిమానికి ఆర్థిక సాయం చేస్తోన్న స్టార్ హీరో !

Published on Dec 9, 2018 11:18 am IST

కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌ తనది పెద్ద మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు. బెంగళూరులో నివసిస్తున్న రాహుల్‌ అనే పన్నెండు సంవత్సరాల బాలుడికి బ్రెయిన్‌ ట్యూమర్. గత కొంత కాలంగా రక్తస్రావం వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అయితే రాహుల్‌ ట్రీట్మెంట్ కు ఎనిమిది లక్షలు ఖర్చువుతాయని డాక్టర్స్ తేల్చి చెప్పారు.

కాగా, పేదవారైనా రాహుల్‌ తల్లిదండ్రులు అతి కష్టం మీద నాలుగు లక్షలు వరకు సమకూర్చుకోగలిగారు. ట్రీట్మెంట్ కి ఇంకా మరో నాలుగు లక్షల అవసరం ఉంది. దీంతో రాహుల్‌ తన అభిమాన హీరో సుదీప్‌ కు ట్విట్టర్‌ ద్వారా తన పరిస్థితిని వివరించాడు. రాహుల్ ట్వీట్ చుసిన సుదీప్‌ సమాధానమిస్తూ.. తనని స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు.

మొత్తానికి ఈ కన్నడ స్టార్ అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి ఆర్థిక సాయం చేయటానికి ముందుకు రావడం నిజంగా గొప్ప విషయమే.

సంబంధిత సమాచారం :