బరువు తగ్గే పనిలో స్టార్ హీరో !
Published on Oct 16, 2017 4:34 pm IST

స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ కు సీక్వెల్ గా ‘ఇండియన్-2’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. కానీ ఈ చిత్రం ఆగిపోయిందని కాసేపు కమల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో వేరొక స్టార్ హీరో వస్తారని కాసేపు వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వాస్తవం కాదని, ఎవరో కావాలనే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని చిత్ర టీమ్ క్లారిటీ ఇచ్చింది.

అంతేగాక కమల్ హాసనే ఈ ప్రాజెక్ట్ చేస్తారని, ఈ సినిమా కోసం ఆయన బరువు తగ్గించుకునే పనిలో ఉన్నారని, ఇందు కోసం అమెరికా నుండి ట్రైనర్ ను రప్పించుకుని ఫిట్నెస్ పెంచుకుంటున్నారని, వాస్తవానికి సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయడానికంటే ముందే కమల్ డైటింగ్ మొదలుపెట్టారని తెలిపారు. మరి సినిమా కోసం ఎంతవరకైనా వెళ్లి, ఎలాంటి లుక్ లో నైనా ఒదిగిపోయే కమల్ ‘ఇండియన్-2’ లో ఎలా కనిపిస్తారో చూడాలి. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళంలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook