‘డియర్ కామ్రేడ్’ హిందీలోకి కూడా వెళ్తున్నాడు !

Published on Jul 23, 2019 7:31 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న రాబోతున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్ తో ‘డియర్ కామ్రేడ్’ ఆకట్టుకుంటున్నాడు. కాగా ఈ సినిమా విడుదల అవ్వకముందే, ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు.

ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. మొత్తానికి కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో నిర్మించాలనుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో రష్మిక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోండగా.. విజయ్ దేవరకొండ సోషల్ భావాలు ఉన్న స్టూడెంట్ గా.. టిపికల్ లవర్ గా కనిపించనున్నాడు.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండకు ‘డియర్ కామ్రేడ్’ ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More