స్ట్రాంగ్ బజ్..ప్రభాస్ 25 కి ఈ దర్శకుడే కన్ఫర్మ్.!

Published on Oct 5, 2021 6:20 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 25వ సినిమాకి రంగం సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ప్రభాస్ 25వ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు సహా సోషల్ మీడియాలో మంచి సందడి వాతావరణం నెలకొంది. అయితే పెద్దగా డీటెయిల్స్ బయటకి రాలేదు కానీ సినిమాపై హైప్ మాత్రం ఇంకో స్థాయిలో ఉంది.

ఇక ఈ చిత్రానికి నిర్మాణం ఎవరు దర్శకుడు ఎవరు ప్రశ్నల్లో మాత్రం దర్శకుడు అనే దానికి సమాధానం దొరికినట్టే తెలుస్తుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో అంతర్గత సమాచారం ప్రకారం ప్రభాస్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ ని సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్నాడట. ఆల్ మోస్ట్ ఈ దర్శకుని పేరే రేపు 7వ తేదీన అనౌన్స్ కానున్నట్టు తెలుస్తుంది. మరి దీనిలో ఎంతమేర నిజముందో తెలియాలి అంటే 7అవా తారీఖు వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :