మహేష్ చిత్రంలో హైలైట్ అదే !
Published on Jan 25, 2017 4:32 pm IST


ప్రస్తుతం మహేష్ – మురుగదాస్ ల చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ నెలాఖరు నుంచి ముంబైలో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది.

ఈ చిత్రం లో విజువల్స్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రంలోని విజువల్స్ ని తీర్చిదిద్దుతున్నారు.చాలా కాలం తరువాత సంతోష్ శివన్ ఈ చిత్రం కోసం కెమెరా మాన్ గా పనిచేస్తున్నారు.ఈ చిత్రం లో మహేష్ ని మునుపెన్నడూ చూడని విధంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మురుగదాస్ ప్రముఖ సాంకేతిక నిపుణులతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.మహేష్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

 
Like us on Facebook