‘ప్రేమకథా చిత్రమ్’ తో హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ బాబుతో జత కట్టిన నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా విజయంపై సుధీర్ బాబు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కచ్చితంగా తనకి కావాల్సిన హిట్ ఇదవుతుందని .
సరైన రిలీజ్ కోసం ఈ చిత్ర టీం ఎదురు చూస్తోంది. త్వరలోనే ఈ లవ్ స్టొరీని రిలీజ్ చేసే విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.


