కెరీర్ ను ఇంకో రకంగా ప్లాన్ చేస్తున్న సునీల్ !
Published on Dec 3, 2017 10:32 am IST

హీరోగా నటుడు సునీల్ కెరీర్ కొంత కష్టాల్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గత చిత్రాలు ‘ఉంగరాల రాంబాబు, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే’ వంటివి బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. దీంతో ఆయన ఇది వరకు అయిన్ చేసిన ఒక సినిమాను కూడా వదులుకోవాల్సి పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఆయన చేసిన ‘2 కంట్రీస్’ అనే ఒక్క సినిమా మాత్రమే విడుదలకానుంది.

అందుకే సునీల్ హీరోగతా కొనసాగుతూనే కెరీర్ ను కమెడియన్ గా ఇంకో దారిలో కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పలు సినిమాల్లో కీ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు వి. సముద్ర చేయనున్న సినిమాలో సునీల్ ఒక కీలక పాత్ర చేయనున్నారట. అంతేగాక కొద్ది రోజుల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకున్న త్రివిక్రమ్, తారక్ ల సినిమాలో సైతం సునీల్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నారంటూ వార్తలొచ్చిన సంగతి విధితమే.

 
Like us on Facebook