ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మంజుమ్మల్ బాయ్స్”

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మంజుమ్మల్ బాయ్స్”

Published on May 5, 2024 3:00 AM IST

మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ (Manjummel boys) ఏప్రిల్ 6, 2024న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయగా, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో నేటినుండి తెలుగు భాషతో పాటుగా, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

స్నేహితుల బృందం కొడైకెనాల్‌కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు