‘జోష్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ, హీరో సునీల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే! శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించిన విషయం తెలిసింది. స్విట్జర్లాండ్‌లో ఓ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుత షెడ్యూల్‌లో రెండు పాటలు, దాదాపుగా 13 సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్, మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయినా ఈమధ్య కాస్త వెనుకబడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విజయం తప్పనిసరైంది. దిల్‌రాజు పకడ్బందీ స్క్రిఫ్ట్, టీమ్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తనకు హీరోగా మళ్ళీ మంచి పేరు తెస్తుందని సునీల్ భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


