భారీ బడ్జెట్ తెలుగు సినిమాలో సన్నీ లియోనీ !
Published on Dec 3, 2017 1:27 pm IST

బాలీవుడ్ నటి సన్నీ లియోనీకి తెలుగునాట కూడా భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఐటమ్ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె త్వరలోనే ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుంది. అది కూడా సాదా సీదా సినిమా కాదు. ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న పిరియాడికల్ వార్ డ్రామా.

ఈ సినిమా కోసం సన్నీ లియోనీ 150 రోజుల కాల్ షీట్లను కేటాయించించారట. దీన్ని బట్టి సినిమా ఏ స్థాయిదో ఇట్టే అర్థమైపోతుంది. విసి. వడివుడియన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook