సన్నీ లియోనీ సినిమా మొదలైంది !

బాలీవుడ్ నటి సన్నీ లియోనీకి తెలుగునాట కూడా భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె ఇప్పుడు పూర్తి స్థాయి కథానాయకిగా దక్షిణాది పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమారు.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజు చెన్నైలో మొదలైంది.

ఈ సినిమా కోసం సన్నీ లియోనీ 150 రోజుల కాల్ షీట్లను కేటాయించించారట. ‘వీరమాదేవి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ చిత్రం చారిత్రిక నైపథ్యంలో ఉండనుంది. విసి. వడివుడియన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో సన్నీ వారియర్ క్వీన్ గా కనబడనుంది. 2019 వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.