ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ ఉంటుంది – డైరెక్టర్ మారుతీ

Published on Jul 7, 2022 1:30 am IST

ఈరోజుల్లో మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన యువ దర్శకుడు మారుతీ ఆ మూవీతో దర్శకుడిగా మంచి పేరు అందుకున్నారు. ఇక అక్కడి నుండి దర్శకుడిగా తనని తాను నిరూపించుకుని మంచి విజయాలు అందుకున్న మారుతీ, లేటెస్ట్ గా గోపీచంద్, రాశి ఖన్నాల కలయికలో తెరకెక్కించిన మూవీ పక్కా కమర్షియల్. యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ఇటీవల రిలీజ్ అయి ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు మారుతీ.

అయితే దర్శకుడిగా తన కెరీర్ లో చేసిన భలే భలే మగాడివోయ్ మూవీ కి సీక్వెల్ తీస్తే బాగుంటుందని పలువురు నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం తనని సోషల్ మీడియాలో కోరడం జరిగిందని, అయితే అప్పట్లో దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదని, లేటెస్ట్ గా ఆ మూవీకి సీక్వెల్ తీయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఫస్ట్ పార్ట్ ని కొనసాగింపుగా కాకుండా ఈసారి యాక్షన్ జానర్ లో మూవీ తెరకెక్కించేలా ఒక ఆలోచన చేస్తున్నట్లు చేస్తున్నట్లు చెప్పారు మారుతీ. మరి త్వరలో అది కనుక కార్యరూపం దాల్చి సినిమాగా తెరకెక్కితే నాని ఫ్యాన్స్ కి ఇది మంచి శుభవార్తే.

సంబంధిత సమాచారం :