సురేందర్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఆ బిగ్ హీరో.. నిజమేనా?

సురేందర్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఆ బిగ్ హీరో.. నిజమేనా?

Published on Oct 9, 2019 8:09 PM IST

సైరా సక్సెస్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు మరింత మారుమోగిపోతుంది. బాహుబలి సెన్సేషన్ రాజమౌళి తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. సైరా సినిమా వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టును ఆయన నిర్వహించిన విధానంపై సర్వత్రా అద్భుతమైన ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా దండిగానే దండుకుంటుంది.

అయితే సైరా వంటి భారీ సక్సెస్ అందుకున్న సురేందర్ రెడ్డి యొక్క తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ప్రభాస్‌తో ఉండబోతుందని, ఆయన కోసం ఒక కథను కూడా రెడీ చేసుకున్నారని, ఆ కథను త్వరలోనే ప్రభాస్‌కి వివరించడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం సురేందర్ రెడ్డి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు