‘అసురన్’ను అందరూ చూసినా పర్వాలేదంటున్న సురేష్ బాబు

Published on Nov 18, 2019 9:45 pm IST

తమిళ హిట్ చిత్రం ‘అసురన్’ను తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఉండటం వలన చాలామంది తెలుగు ప్రేక్షకులు వీక్షించేశారు. దీంతో తెలుగు రీమేక్ కు ఆదరణ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత సురేష్ బాబు మాత్రం అలాంటి నష్టమేమీ జరగదని అంటున్నారు.

సినిమాను చాలామంది చూసినా ఎలాంటి ఇబ్బందీ లేదని, సినిమాను చూడాల్సిన ప్రేక్షకులు చాలామందే మిగిలి ఉంటారని అంటూ గతంలో వెంకీ చేసిన ‘అబ్బాయిగారు’ చిత్రాన్ని గుర్తుచేశారు. ఆ చిత్రం మొదట కన్నడం, ఆ తర్వాత తమిళంలో రూపొందిన తర్వాత తెలుగులోకి రీమేక్ అయిందని, అయినా సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకొచ్చారు. అలాగే తమిళ వెర్షన్లో ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉంటాయో తెలుగులో కూడా అవన్నీ ఉంటాయని గ్యారెంటీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More