కొత్త సినిమాను మొదలుపెట్టిన సూర్య !

22nd, January 2018 - 01:46:41 PM

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవలే ‘గ్యాంగ్’ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఈ జోష్ లోనే ఆయన తన 36వ సినిమాను మొదలుపెట్టారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం ఈరోజే రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టుకుంది.

ప్రస్తుతం చెన్నైలో షూట్ జరుగుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవులు హీరోయిన్లుగా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వనున్నారు. ఈ ఏడాది దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.