‘యముడు’ బ్రాండ్‌ను వదిలిపెట్టని సూర్య!
Published on Nov 8, 2016 5:48 pm IST

singham-21
‘గజిని’ సినిమాతో తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ సూపర్ స్టార్ సూర్యను ఇక్కడా స్టార్‌ను చేసిన సినిమాలు.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం – యముడు 2). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా ‘సింగం 3’ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా టీమ్ ఇప్పటికే మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ‘సింగం 3’ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు.

ఇక తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్ టీజర్‌ను కూడా నిన్ననే విడుదల చేసిన టీమ్, తెలుగులో ఈ సినిమాకు ‘ఎస్ 3 – యముడు 3’ అన్న టైటిల్‍ను ఖరారు చేసింది. తమిళంలో ‘ఎస్ 3 – సింగం 3’ అన్నది టైటిల్. ఇక ‘యముడు’, ‘యముడు 2’ తరహాలోనే ఈ మూడో భాగం కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని టీజర్ స్పష్టం చేసింది. ‘తప్పు చేస్తే ఆ దేవుడినైనా వదిలిపెట్టను’ అంటూ ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా మెప్పించేందుకు సూర్య సిద్ధమైపోయారు. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.

యముడు 3 టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook