స్టార్ హీరో బర్త్ డేకి గోల్డ్ రింగ్స్ పంచిన ప్రక్క రాష్ట్రం ఫ్యాన్స్

Published on Jul 23, 2019 9:31 am IST

తమిళ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కేరళలోని సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కేరళ కొల్లామ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నేడు పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్ తో పాటు ఓ ఫోల్డెడ్ బెడ్ కిట్ ని పంచనున్నారు. ఈ మేరకు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ప్రక్క రాష్ట్రంలో కూడా సూర్య కి ఈ స్థాయి ఫ్యాన్స్ ఉన్నారంటేనే ఆయన రేంజ్ ఏమిటో తెలిసిపోతుంది. తెలుగులో కూడా హీరో సూర్య కు మంచి మార్కెట్ ఉంది. పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకునే కొద్దిమంది హీరోలలో సూర్య ఒకరు. డెడికేటెడ్ యాక్టర్ గా అతనికి పరిశ్రమలో మంచి పేరుంది.

1997లో వచ్చిన “నెర్రుక్కు నేర్” చిత్రంతో సూర్య చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీలో విజయ్ కూడా మరో హీరోగా నటించారు. ఆతరువాత 2001 బాల దర్శకత్వంలో వచ్చిన “నంద” మూవీ తనకు మొదట హిట్ అందించింది. తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన “కాక కాక” మూవీతో సూర్య మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2005లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “గజిని” చిత్రం సూర్యకి సౌత్ ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చిపెట్టింది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఆరు, యముడు వంటి చిత్రాలతో సూర్య తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న “బందోబస్త్” ఈ నెల 30న విడుదల కానుండగా,”సురారై పోట్రు” వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :