అదేరోజు విడుదల కానున్న సూర్య గ్యాంగ్ !

29th, December 2017 - 03:26:25 PM


సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘తానా సెరెంద కూట్టమ్‌’. ఈ సినిమా తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో అనువాదమవుతున్న సంగతి తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘స్పెషల్ 26’ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పోన్స్ లభిస్తోంది.

ఈ సినిమాను ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో యు.వి. క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమా పై తమిళ్ లో భారి అంచనాలు ఉన్నాయి.