ఎన్జికె షూటింగ్ అప్డేట్ !

Published on Dec 10, 2018 7:44 pm IST


తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పొలిటికల్ డ్రామా ‘ఎన్జికె’ యొక్క ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం కేరళలోని కొచ్చిన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సూర్య , రకుల్ ప్రీత్ సింగ్ లపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది పిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

ఇక సూర్య ఈ చిత్రం తో పాటు కె వి ఆనంద్ దర్శకత్వంలో తన 37వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇవే కాగా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు ఈ యాక్షన్ హీరో. దాంట్లో భాగంగా ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో అలాగే ‘సింగం’ సిరీస్ డైరెక్ట్ హరి దర్శకత్వంలో నటించడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ రెండింట్లో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :