సైరా షూటింగ్ అప్డేట్ !

Published on Dec 9, 2018 10:32 pm IST


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ తదుపరి షెడ్యూల్ మైసూర్ లో జరగనుందని సమాచారం. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ చారిత్రాత్మక నగరం లో చిత్రీకరిస్తే బాగుటుందని దర్శుకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఈచిత్రంలో చిరు , ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి పాత్రలో నటిస్తుండగా అమితాబ్ ఆయనకు గురువుగా కనిపించనున్నారు.

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో నయన తార ,తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై హీరో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :