మార్చి 5 నుండి ‘సైరా’ సెకండ్ షెడ్యూల్ !
Published on Feb 26, 2018 6:10 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సైరా’. ఖైదీ నంబర్‌ 150 తరువాత చిరు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలుకావాలి.

కాని కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. మార్చి 5నుండి హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చిరంజీవితో పాటు నయనతార, అబితాబ్ బచ్చన్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో రూపొందుతున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాస్తున్నారు.

 
Like us on Facebook