‘సైరా’ ఎన్ని సినిమాల్ని బీట్ చేస్తుందో చూడాలి

‘సైరా’ ఎన్ని సినిమాల్ని బీట్ చేస్తుందో చూడాలి

Published on Oct 13, 2019 7:03 PM IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈరోజుతో వసూళ్లు రూ.100 కోట్ల మార్కును చేరనున్నాయి. ఇక ఓవర్సీస్లో సైతం దాదాపు ఇదే దూకుడు కనబడుతోంది. నిన్న శనివారంతో యూఎస్ కలెక్షన్స్ 2,448,312 డాలర్లకు చేరుకున్నాయి.

ఈ మొత్తం చిరు ఆల్ టైమ్ బెస్ట్ ‘ఖైదీ నెం 150’ వసూళ్లు 2,447,043 డాలర్ల కంటే ఎక్కువ. ఈ మొత్తంతో చిత్రం ఆల్ టైమ్ టాప్ 10 జాబితాలోకి చేరింది. ఫుల్ రన్ ముగిసేసరికి జాబితాలోని కొన్ని సినిమాల్ని ‘సైరా’ అధిగమించవచ్చు. జాబితాలో టాప్ 2గా ‘బాహుబలి2, బాహుబలి 1’ ఉండగా 2.44 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ‘అ..ఆ’, 2.46 మిలియన్ డాలర్లతో 8వ స్థానంలో ‘గీతా గోవిందం’, 2.54 మిలియన్ డాలర్లతో ‘మహానటి’ 7వ స్థానం, 2.90 మిలియన్ డాలర్లతో ‘శ్రీమంతుడు’ 6వ స్థానం, 3.2 మిలియన్ డాలర్లతో ‘సాహో’ 5వ స్థానం, 3.4 మిలియన్ డాలర్లతో ‘భరత్ అనే నేను’ 4వ స్థానం, 3.5 మిలియన్ డాలర్లతో ‘రంగస్థలం’ 3వ స్థానంలో ఉన్నాయి. వీటిలో ఎన్ని చిత్రాల్ని మెగాస్టార్ చిత్రం అధిగమిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు