‘మహేష్ 25’కి సంగీత దర్శకుడు ఖరారు!?
Published on Nov 20, 2016 7:41 pm IST

composer-gopi-sunder
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తోన్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇలా సెట్స్‌పై ఉండగానే, మహేష్ నటించబోయే మరో రెండు కొత్త సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాయి. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా జనవరి నెలాఖర్లోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. అదేవిధంగా ఆ తర్వాత తెరకెక్కే సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని సమాచారం.

పీవీపీ సినిమా నిర్మాణంలో తెరకెక్కనున్న వంశీ పైడిపల్లి – మహేష్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పనిచేయనున్నారట. తెలుగులో ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన గోపీ సుందర్, ఊపిరి సినిమాతో వంశీ పైడిపల్లికి బాగా దగ్గరయ్యారట. ఈ సినిమా కథ కూడా గోపీ సుందర్ మ్యూజిక్ స్టైల్‌కు దగ్గరగా ఉండేది కావడంతో ఆయనను ఎంపిక చేశారట. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్‌కి ఇది 25వ సినిమా కానుండడం విశేషంగా చెప్పుకోవాలి.

 
Like us on Facebook