టాక్ : ‘కల్కి 2898 ఏడి’ రిలీజ్ కోసం పరిశీలనలో ఆ మూడు డేట్స్ ?

టాక్ : ‘కల్కి 2898 ఏడి’ రిలీజ్ కోసం పరిశీలనలో ఆ మూడు డేట్స్ ?

Published on Mar 27, 2024 9:06 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తున్నారు. ఇక ఈమూవీని మే 9న రిలీజ్ చేయనున్నట్లు కొన్ని నెలల క్రితం యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే మూవీకి సంబంధించి కొంత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా పడుతుందని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ టాక్ ప్రకారం కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ కోసం మేకర్స్ మూడు డేట్స్ ని పరిశీలిస్తున్నారట. అవి జూన్ 14, జులై 12, జులై 26. ఇక ఈ మూడు డేట్స్ లో ఒకటి ఫిక్స్ చేసి త్వరలో అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. కాగా ఈ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీపై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు