
ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో గ్లామరస్ అవతారాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అటు అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ సినిమాలే కాకుండా మధ్యలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్న ఈ భామ లోని మరో కోణం బయటకి వచ్చింది. అదే బిజినెస్ యాంగిల్..
ఈ రోజు తమన్నా ‘వైట్ గోల్డ్’ నే జ్యువెలరీ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ఈ జ్యువెలరీ బ్రాండ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎంతోమంది టాప్ డిజైనర్స్ వీటిని తయారు చేస్తున్నారు. అలాగే ఇందులో తమన్నా ఫేవరైట్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’ సినిమా చేస్తోంది, అలాగే రవితేజ సరసన బెంగాల్ టైగర్ సినిమా చేస్తోంది. బాహుబలి మే లో రిలీజ్ కానుంటే బెంగాల్ టైగర్ అక్టోబర్ లో రానుంది.

