ఓటిటి : కేవలం 2 వారాల్లోనే తమిళ్ “రెబల్”.. తెలుగులో కూడా

ఓటిటి : కేవలం 2 వారాల్లోనే తమిళ్ “రెబల్”.. తెలుగులో కూడా

Published on Apr 6, 2024 4:09 PM IST

సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి టాలెంటెడ్ సంగీత దర్శకుల్లో జివి ప్రకాష్ కుమార్ కూడా ఒకరు. మరి తాను సినిమాకి మ్యూజిక్ మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. దీనితో నటుడుగా కూడా ప్రూవ్ చేసుకోగా తాను హీరోగా “ప్రేమలు” సెన్సేషన్ మమిత బైజు హీరోయిన్ గా దర్శకుడు నీకేష్ ఆర్ ఎస్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే “రెబల్”. మనకు తెలుగులో ప్రభాస్ తో రెబల్ ఉన్నట్టుగా తమిళ్ లో వాళ్ళకి ఈ “రెబల్” ఉంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా గత మార్చ్ లో తమిళ్ లో థియేట్రికల్ గా రిలీజ్ చేయగా ఇప్పుడు కేవలం 2 వారాల్లోనే స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. ఒరిజినల్ తమిళ్ సహా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటుగా కన్నడలో కూడా రిలీజ్ కి వచ్చింది. మరి వీటిలో చూడాలి అనుకునేవారు ఈ వీడియోలో ట్రై చేయవచ్చు. చిత్రానికి జివి ప్రకాష్ నే సంగీతం కూడా అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు