చరణ్, ఉపాసనకి ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ !

చరణ్, ఉపాసనకి ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ !

Published on Oct 15, 2018 7:55 PM IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. అయితే ఇప్పటికే రామ్ చరణ్ అర‌వింద స‌మేత‌ పై, తారక్ నటన పై ప్ర‌శంస‌లు కురింపించిన విషయం తెలిసిందే. కాగా రామ్ చరణ్ ప్ర‌శంసిస్తూ.. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ పరఫార్మెన్స్.. అలాగే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అద్భుతం అంటూ రామ్ చరణ్ తారక్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కాగా తాజాగా రామ్ చరణ్ ట్వీట్ కి ఎన్టీఆర్ స్పందిస్తూ… ప్రశంసిస్తూ ట్వీట్ చేసినందుకు చరణ్, ఉపసానాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అరవింద సమేత మీకు నచ్చినందుకు సంతోషిస్తున్నాను. అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇంకా అద్భుతంగా నటించి.. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు