తేజ్ నిద్రపోయాడు, కానీ మీరు ఆనందిస్తారు – రాశి ఖ‌న్నా

Published on Mar 29, 2020 5:36 pm IST

గ్లామర్ బ్యూటీ రాశి ఖ‌న్నా మంచి న‌టి మాత్ర‌మే కాదు మంచి సింగర్ కూడా. తాజాగా ఆమె పాడిన పాట ‘ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు యిచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందే చిలకా’ అంటూ రాశి పాడుతూ ఉండగా పక్కన ఉన్న సాయి ధరమ్ తేజ్ నిద్ర పోతున్నట్లు కూర్చున్నాడు. దర్శకుడు మారుతి ఈ వీడియోను తీశాడు.

కాగా ఈ వీడియోను రాశి తాజాగా పోస్ట్ చేస్తూ..’సాయి ధరమ్ తేజ్ నా గానం విని నిద్రపోయాడు, కానీ మీరు ఈ పాట విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అన్నట్లు మీ హృదయంతో పాడటానికి ఇది మంచి సమయం.. ఇక ఈ వీడియో క్రెడిట్ దర్శకుడు మారుతికే చెందుతుంది’ అని పోస్ట్ చేసింది. ఇక రాశి ఇప్పటికే జోరు, విల‌న్(మ‌ల‌యాళం) అలాగే బాలకృష్ణుడు, జ‌వాన్ వంటి చిత్రాల్లో పలు పాట‌లు పాడిన సంగతి తెలిసిందే. అయితే రాశి ఖన్నా అనగానే బబ్లీ పేస్ గుర్తుకు వస్తోంది. కానీ ఈ మధ్య ఈ బబ్లీ బ్యూటీ వర్కౌట్స్ తో బాగా చేసి సన్నబడింది.

సంబంధిత సమాచారం :

X
More