కాటమరాయుడిని అభినందించిన కేటిఆర్!
Published on Mar 26, 2017 3:25 pm IST


తెలంగాణ మంత్రి కేటిఆర్ పవన్ కళ్యాణ్ ను, ఆయన నటించిన తాజా చిత్రం ‘కాటమరాయుడు’ ను అభినందనలతో ముంచెత్తారు. కేటిఆర్ ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో కలిసి వీక్షించారు. సినిమా చాలా బాగుందని, పవన్ కళ్యాణ్, శరత్ మారార్లకు మంచి విజయం దక్కుతుందని అన్నారు. అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు చాలా మంచి ప్రమోషన్లు చేశారని అంటూ పవ తో కలిసి దిగిన సెల్ఫీలను ట్విట్టర్లో పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో రెండు ప్రభుత్వాలు శ్రద్ద తీసుకుంటున్న నైపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నేత కార్మికులకు జీవితకాలం ఉచిత బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని గతంలోనే మాటిచ్చి, ప్రతి ఒక్కరు వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పవన్ ఈ సినిమా మొత్తం తన పాత్రకు అనుగుణంగా చేనేత వస్త్రాలనే ధరించి కనబడ్డారు.

 
Like us on Facebook