రజినీ ‘కాలా’ లో తెలుగు సీనియర్ నటి..!
Published on Jun 11, 2017 12:30 pm IST


రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’ ఇటీవల ముంబైలో మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది.మూడు వారల విరామం తరువాత జూన్ 24 నుంచి చెన్నైలో రెండవ షెడ్యూల్ మొదలు కానుంది.

ఇప్పటికే భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో తెలుగు సీనియర్ నటి ఈశ్వరి రావు కూడా అవకాశం దక్కించుకోవడం విశేషం.ఇప్పటికే ఆమె మొదటి షెడ్యూల్ లో పాల్గొంది. ఇటీవల కాలం తెలుగులో కూడా ఈశ్వరి రావు కు మంచి పాత్రలు దక్కుతున్నాయి. అ..ఆ.., నేనులోకల్, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలలో ఆమె పాత్రకు మంచి గుర్తిపు లభించింది. నానా పటేకర్, హుమా క్యూరేషి , అంజలి పాటిల్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు ‘కాలా’ చిత్రం లో నటిస్తున్నారు. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 
Like us on Facebook