
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి వితిక షేరు. ఈ సినిమాలో తన లుక్స్, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న వితిక షేరు రీసెంట్ గా వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘పడ్డానండి ప్రేమలోమరి’ సినిమాతో కూడా ఆకట్టుకుంది. ఈ భామ తమిళ్ లో చేసిన తన మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంది. వితిక షేరు హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా ‘మహాబలిపురం’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
యంగ్ ఫిల్మ్ మేకర్ డాన్ సాండీ మహాబలిపురంలో జరిగిన త్యదార్త సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందిచ్న్హాడు. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం డ్రగ్స్ మరియు అమ్మాయిలపై జరిగే అత్యాచారాల చుట్టూ తిరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చెప్పిన సోషల్ మెసేజ్ ని మెచ్చుకోవడమే కాకుండా చివరి 40 నిమిషాలు అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న వితిక షేరు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీ గా ఉంది.

