‘సైరా’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన థమన్ !
Published on Dec 1, 2017 9:10 am IST

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కి ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందివ్వాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ వలన ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో అందరూ మోషన్ పోస్టర్ కు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్ ను ప్రాజెక్టులోకి తీసుకుంటారని అన్నారు.

ఇదే విషయంపై నిన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన థమన్ ఒక అభిమాని అడగ్గా ఇంకా తనకు సైరా మేకర్స్ నుండి పిలుపు రాలేదని, ఒకవేళ వస్తే తప్పకుండా చెబుతానని సమాధానమిచ్చారు. దీన్నిబట్టి సైరా సంగీత దర్శకుడి స్థానం ఇంకా ఖాళీగానే ఉందని అర్థమవుతోంది. మరి మెగా క్యాంప్ చివరకు థమన్ నే చూజ్ చేసుకుంటారా లేకపోతే వేరే ఎవర్నైనా ఎంచుకుంటారా అనేది చూడాలి. ఇకపోతే రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఈ డిసెంబర్ నెల నుండే మొదలుకానుంది.

 
Like us on Facebook