“భీమ్లా నాయక్” డీజే సాంగ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్!

Published on Dec 30, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ అని కూడా అందరికీ తెలిసిందే.

మరి థమన్ ఇచ్చిన మాస్ ట్యూన్ “లా లా భీమ్లా” కి సాలిడ్ రెస్పాన్స్ రాగా దానికి మరింత హైప్ ఎక్కిస్తూ ఈ సాంగ్ కి డీజే వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి దీనిని రేపు డిసెంబర్ 31న సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా కంపోజర్ థమన్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ డీజే సాంగ్ ప్రోసెసింగ్ లో ఉందని తనకి కూడా సాంగ్ పట్ల చాలా హై ఉందని చెబుతున్నాడు. దీనితో ఈ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు సాయంత్రం మాత్రం ఈ సాంగ్ తో స్పీకర్లు బ్లాస్ట్ అవ్వడం అనేది గ్యారెంటీ.

సంబంధిత సమాచారం :