రాజమౌళి నోటి నుండి వచ్చే ఆ చిన్నమాటే అద్భుతంతో సమానం – రామ్ చరణ్

Published on Mar 8, 2023 10:44 pm IST


టాలీవుడ్ స్టార్ నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది విడుదలై సంచలన విషయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేసారు. ఇక ఈ మూవీ గ్లోబల్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుని మరింత మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలానే ఈ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచింది. కాగా మార్చి 13న జరుగనున్న ఆ వేడుకల కోసం ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ అమెరికా చేరుకున్నారు.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కి సంబంధించి అక్కడి ప్రమోషన్స్ లో భాగంగా నేడు టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రగోస్లో తో జరిగిన పోడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్, ఆర్ఆర్ఆర్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపారు. నిజానికి ఒకసారి సెట్స్ లోకి అడుగుపెట్టాక రాజమౌళి సహా టీమ్ మొత్తం సినిమా పైనే దృష్టి పెట్టాల్సిందే అని, ఇక ఏదైనా సీన్ ఒక్క టెక్ లో ఓకె అయితే చాలా మంది సూపర్, ఫెంటాస్టిక్ అని అంటరాని కానీ రాజమౌళి మాత్రం గుడ్, నైస్ అని అంటరాని, అదే పదం అద్భుతంతో సమానం అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :