ఓటిటి: మరో 2 భాషల్లో ది “ఫ్యామిలీ స్టార్” వచ్చేసింది

ఓటిటి: మరో 2 భాషల్లో ది “ఫ్యామిలీ స్టార్” వచ్చేసింది

Published on May 24, 2024 11:01 AM IST


టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్”. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. అయితే ఈ చిత్రం ఓటిటిలో వచ్చాక మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది.

తెలుగు సహా తమిళ్ లో మొదట అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం చాలా రోజులే నెంబర్ 1 స్థానంలో ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నేటి నుంచి అదే ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం కన్నడ సహా మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఆడియెన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు