“ది కేరళ స్టోరీ” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on May 26, 2023 5:00 pm IST


ది కేరళ స్టోరీ చిత్రం చిన్న సినిమా గా థియేటర్ల లో విడుదల అయ్యి, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు అని మరోసారి ది కేరళ స్టోరీ చిత్రం నిరూపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. ఈ చిత్రం నిన్న మరో 3.10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 213.47 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఫిమేల్ లీడ్ తో సినిమా ఈ తరహా వసూళ్లు రాబట్టడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ తరహా చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే తొలిసారి. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. వీకెండ్ మళ్ళీ మొదలు కావడం తో కలెక్షన్స్ జోరు పెరిగే అవకాశం ఉంది. సుదిప్తో సేన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో అదా శర్మ, సిద్ది ఇద్నానీ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :