రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేస్తోన్న “ది లయన్ కింగ్” !

Published on Jul 22, 2019 11:14 am IST

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ డిస్నీవారు సమర్పణలో 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో నిర్మించిన జంగిల్ యానిమేషన్ మూవీ “ది లయన్ కింగ్”. అద్భుతమైన విజువల్స్ తో పిల్లల నుంచీ పెద్దల వరకూ మంచి ఎమోషనల్ విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ చిత్రం. ఏపీ మరియు తెలగాంణలో అలాగే హైదరాబాద్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మొట్టమొదటిసారిగా ఇంగ్లీషు డబ్బింగ్ ఫిల్మ్ నైజాంలో ఆధిపత్యం చెలాయిస్తోంది.

విడుదల రోజు కంటే కూడా, ఆదివారం రోజున ఈ చిత్రం దాదాపు రెట్టింపు కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇంగ్లీష్ ఫిల్మ్ అయినప్పటికీ.. స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని సినిమా చూసినవాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రానికి తెలుగు వర్షన్ లో.. సింబా పాత్రకు నాని, అలాగే స్కార్ పాత్ర కి జ‌గ‌ప‌తి బాబు, ముఫార్ పాత్ర కి పి.ర‌విశంక‌ర్ డబ్బింగ్ చెప్పడంతో.. ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ అయింది.

సంబంధిత సమాచారం :