అవైటెడ్ “ది మార్వెల్స్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

అవైటెడ్ “ది మార్వెల్స్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Jan 23, 2024 1:04 PM IST

హాలీవుడ్ ప్రముఖ కామిక్ మరియు నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ కోసం ఇండియన్ ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి మార్వెల్ స్టూడియోస్ నుంచి రీసెంట్ గా వచ్చిన అవైటెడ్ చిత్రమే “ది మార్వెల్స్”. ఓటిటి లో వచ్చిన లీడ్ మిస్ మార్వెల్ కి కొనసాగింపుగా బిగ్ స్క్రీన్స్ పై సినిమాగా దీనిని చేయగా ఇందులో ఇమాన్ వెళాని తో పాటుగా కెప్టెన్ మర్వెల్ పాత్రదారిని బ్రై లార్సెన్ కూడా నటించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.

అయితే అంత రేంజ్ వసూళ్ళని రాబట్టలేదు కానీ ఓ మోస్తరుగా రన్ అయ్యిన ఈ సినిమాని ఓటిటిలో వచ్చాక చూద్దామని చాలా మంది ఎదురు చూసారు. ఇక ఫైనల్ గా ఆ డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఈ సినిమాని మార్వెల్ అనుబంధ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు ఈ ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా కోసం చూస్తున్నవారు అప్పుడు చూడవచ్చు. ఇక ఈ చిత్రాన్ని నియా డకోస్టా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు