అన్ని థియేటర్లు మూసివేయాలన్న నిర్మాతలు మండలి !

అన్ని థియేటర్లు మూసివేయాలన్న నిర్మాతలు మండలి !

Published on Dec 14, 2017 2:23 PM IST

తెలుగు నిర్మాతల మండలి సంచలనం నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరి వలన ఏర్పడుతున్న సమస్యలకు నిరసనగా మార్చి 1నుండి అన్ని థియేటర్లు మూసివేయాలని, సినిమాలేవీ విడుదలకావని, నిర్మాతలు మార్చి 1 తర్వాత షూటింగ్స్ పెట్టుకోకపోతే మంచిదని నిర్మాతలు మండలి తెలిపింది.

డిడిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లైన యూఎఫ్ఓ, క్యూబ్, పిఎక్స్డి, స్క్రాబల్ వంటి సంస్థలు ఏకరీతిన వ్యవహరిస్తుండటం వలన విడుదల సమయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిపై కనీసం చర్చించడానికి కూడా వారు చర్చలకు రావడంలేదని అందుకే అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నామని మండలి తెలిపింది. ఇక వచ్చే ఏడాదిలోనే భారీ బడ్జెట్ సినిమాలన్నీ విడుదలవుతుండటంతో ఈ సమస్య త్వరగా పరిష్కారమైతే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు