ఇంటర్వ్యూ: శీరత్ కపూర్ – నాగార్జునగారి నుండి చాలా నేర్చుకోవచ్చు !
Published on Oct 10, 2017 5:01 pm IST

‘రన్ రాజ్ రన్’ ఫేమ్ శీరత్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘రాజుగారి గది-2’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) పూర్తిగా రివీల్ చేయకూడదు. కొంచెం మాత్రమే చెప్తాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా సరదగా ఉంటుంది. ఎక్కడా డిఫికల్ట్ అనిపించదు. అందులోను వేరియేషన్స్ ఉండే పాత్ర. నిజంగా అలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్ర) ఓంకార్ డైరక్షన్లో నటించడం ఎలా ఉంది ?
జ) ఓంకార్ మంచి దర్శకుడు. ఆయనతో పనిచేయడం చాలా బాగుంది. హీరోని, హీరోయిన్ ని వేరు వేరుగా చూడరు. అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తారు.. డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు.

ప్ర) ‘కొలంబస్’ తర్వాత చాల గ్యాప్ త్రీసుకున్నారు ఎందుకు ?
జ) అవును. కొలంబస్ తర్వాత గ్యాప్ వచ్చిన మాట నిజమే. ఆ సమయంలో కొందరు నేను బాలీవుడ్ సినిమాల కోసం మాత్రమే చూస్తున్నానని, తెలుగు చేయడంలేదని అన్నారు. అవన్నీ నిజాలు కావు. ఇక గ్యాప్ ఎందుకొచ్చిందీ అంటే నాకు అన్ని విధాల నచ్చిన పాత్రలు, కథలు దొరక్క.

ప్ర) ‘కొలంబస్’ అంతలా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏమిటో గుర్తించారా ?
జ) సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. సినిమా కూడా బాగానే వచ్చింది. కానీ బాగున్న సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలని రూలేం లేదు కదా.

ప్ర) నాగార్జునతో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?
జ) మా ఇద్దరి మీదా చాలా సన్నివేశాలు ఉన్నాయి. అన్నీ బాగా వచ్చాయి.

ప్ర) అంత పెద్ద హీరోతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
జ) చాలా బాగుంది. ఆయన చాలా వినయంగా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు. డైరెక్టర్ దగ్గర నుండి లైట్ బాయ్ వరకు ప్రతి ఒక్కరికీ సమన గౌరవం ఇస్తారు. ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు.

ప్ర) ఇటీవల మీ ఫోటోషూట్స్ పై వచ్చిన కామెంట్స్ పై మీ స్పందన ?
జ) ఆ ఫోటోషూట్స్ వెనుక ఒక బలమైన కాన్సెప్ట్ ఉంది. డిజైనర్ మంచి ఉద్దేశ్యంతో ఆ షూట్ చేశారు. ఆ ఫోటోల్లోని నా ముఖంలో మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్స్ కనిపిస్తాయి. అది కొంతమందికి మాత్రమే అర్థమైంది. కానీ కొందరు నా దుస్తులు చూసి రకరకాల కామెంట్స్ చేశారు.

ప్ర) మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) విఐ ఆనంద్, అల్లు శిరీష్ ల ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది కాకుండా రవికాంత్ పేరెపు డైరెక్షన్లో, రానా నిర్మాణంలో ఒక సినిమా, రవి తేజగారి ‘టచ్ చేసి చూడు’ వంటి మూడు కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. అన్నీ ఒకేసారి మొదలయ్యాయి.

 
Like us on Facebook