యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన పీరియాడిక్ విలేజ్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ పల్లెటూరి కథ.. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్రంలో ‘రాజప్ప’ పాత్రతో అద్భుతమైన నటన కనబరిచి, మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ కొట్టె తన పదేళ్ల సినీ ప్రయాణంలోని ఒడిదొడుకులను, ఎమోషనల్ మూమెంట్స్‌ను పంచుకున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి వెండితెర వరకు
చిత్తూరు జిల్లా పళమనేరుకు చెందిన ప్రదీప్ కొట్టె.. చెన్నై, హైదరాబాద్‌లలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ ఆధ్వర్యంలో నాటకాలు వేసేవారు. ఆ స్టేజ్ ఆర్ట్ చూసే దర్శకుడు మునిరాజు ఆయనను ‘రాజప్ప’ పాత్రకు ఆడిషన్ చేసి ఎంపిక చేశారు. అయితే ఈ జర్నీ అంత సులువుగా సాగలేదని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్, లీవులు పెడుతూ అటు జాబ్‌ను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో తన భార్య ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదని, ఆమె ఫ్యామిలీ బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్లే తాను కెరీర్‌పై ఫోకస్ పెట్టగలిగానని కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.
కన్నవారికి తెలియని రహస్యం
నిర్మాత కిరణ్ అబ్బవరంతో ఉన్న పాత పరిచయాన్ని ప్రదీప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాము షార్ట్ ఫిలిమ్స్ చేసే రోజుల్లోనే కిరణ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని, సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ మీద పట్టు సాధించి ఆయన ఈ స్థాయికి చేరారని ప్రశంసించారు. ఇక సినిమా షూటింగ్ రోజుల్లో జరిగిన ఒక మెమరబుల్ మూమెంట్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను నటన వైపు ఉన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని, కేవలం తన అక్కకు మాత్రమే తెలుసని చెప్పారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అక్క.. తల్లిదండ్రులకు చెప్పకుండా లొకేషన్‌కు తీసుకువచ్చిందని, కన్నవారు తనను కెమెరా ముందు నటుడిగా చూసిన ఆ క్షణం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. ప్రస్తుతం కొన్ని వైవిధ్యమైన కథలు వింటున్నానని, కేవలం అవకాశాల కోసం కాకుండా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రల కోసమే ఎదురుచూస్తున్నట్లు ప్రదీప్ స్పష్టం చేశారు.


