అద్భుతమైన పెళ్లి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ – సమంత
Published on Oct 15, 2017 7:45 pm IST

సమంత, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి గది -2’ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే సక్సెస్ మీట్ ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, సమంతలు కూడా పాల్గొన్నారు. సమంత మాట్లాడుతూ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలని, ఇదే తనకు వాళ్ళిచ్చిన బెస్ట్ పెళ్లి గిఫ్ట్ అని అన్నారు.

నాగార్జున కూడా నాగ చైతన్య పెళ్లి, రాజుగారి గది -2 రెండూ సక్సెస్ కావడంతో ఎంజాయ్ చేస్తున్నానని, కొత్త కోడలు సమంత వచ్చింది, సినిమా హిట్టవుతుంది అనుకున్నా, కానీ తను బ్లాక్ బస్టర్ ఇచ్చింది అంటూ సమంత తమ కుటుంబానికీ చాలా లక్కీ అన్నారు. ఇకపోతే చిత్రం మొదటిరోజు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత తర్వాత మెల్లగా పుంజుకుని రెండు రోజులకు గాను మంచి వసూళ్ళను సాధించింది.

 
Like us on Facebook