చరణ్ పోలీసైతే మరి ఎన్టీఆర్..?

Published on Apr 4, 2020 7:10 am IST

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ ని పోలీస్ గా పరిచయం చేసేశాడు. ఆయన ప్రయత్నానికి వందకి వంద మార్కులు పడ్డాయి. సీరియస్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ గా చరణ్ లుక్స్ కేక పుట్టించాయి. జస్ట్ నిమిషం నిడివిగల ఈ వీడియోలో గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చరణ్ రోల్ ని వీర లెవల్లో ఎలివేట్ చేసింది. చరణ్ రెండు మూడు గెటప్స్ లో కనిపించనుండగా అందులో ఈ పోలీస్ గెటప్ ఒకటని తెలుస్తుంది. రామరాజు పోలీస్ గా ఎలా మారడు అనేది కథలోని ట్విస్ట్. ఇక ఎన్టీఆర్ పరిచయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరింగా మారింది.

ఐతే చరణ్ ని పోలీస్ గా పరిచయం చేసిన రాజమౌళి ఎన్టీఆర్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడు అనేది ఆసక్తికర అంశం. ఎన్టీఆర్ ని కూడా ఓ పవర్ ప్రొఫెషనల్ లో చూపిస్తాడా లేక కొమరం భీమ్ ఒరిజినల్ లుక్ లో చూపిస్తాడా అనేది చూడాలి.ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో ఆర్ ఆర్ ఆర్ లో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. మరి ఈ అనుమానాలన్నిటికి మే 20న సమాధానం దొరకనుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన ఫస్ట్ లుక్ వీడియో రానుంది.

సంబంధిత సమాచారం :

X
More