ఈసారి ఆలీకి పవన్ నుండి ఆ గిఫ్ట్ దక్కలేదు.

Published on Jun 2, 2020 10:53 am IST

భిన్న వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ తన సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు అరుదైన బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రతి ఏడాది వేసవిలో తన ఫార్మ్ హౌస్ లో పండే ఆర్గానిక్ మామిడి కాయలను స్నేహితులకు పంపడం ఆయనకు ఆనవాతీగా ఉంది. నితిన్, త్రివిక్రమ్ వంటి వారు ఆయనకు అత్యంత ఆప్తులు కాగా వారికి కూడా ప్రతి ఏడాది ఆయన మామిడి పళ్ళు పంపిస్తారు.

ఈ లిస్ట్ లో కమెడియన్ ఆలీ కూడా ఉన్నారు. ఎప్పటి నుండో ఆలీకి పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు. పవన్ నటించిన అనేక సినిమాలలో ఆలీకి ఓ మంచి రోల్ ఉండేది. మరి ఇంత దగ్గరి స్నేహితుడికి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మామిడి కాయలు పంపలేదట. ఈ విషయాన్ని ఆలీ స్వయంగా తెలియజేశారు. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది మాత్రం మామిడి కాయలు పంపలేదు అన్నారు. అలాగే ఎవరికి కూడా ఈసారి పవన్ మామిడి పండ్లు పంపలేదట.

సంబంధిత సమాచారం :

More