ఈ సారి మాస్ సాంగ్ తో వస్తున్న నితిన్ !
Published on Mar 8, 2018 7:08 pm IST

నితిన్‌ 25వ సినిమాగా తెరకెక్కుతున్న రొమాటింక్ ఎంటర్‌టైనర్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి మరో పాట రేపు విడుదల కానుంది. ఈ సాంగ్ మాస్ బీట్ తో కూడుకొని ఉండబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు.

‘ఛల్ మోహన్ రంగ’ చిత్ర షూటింగ్ పార్ట్‌ పూర్తికాగా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ ప్లో జరిగే లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి క‌థ అందించడం విశేషం. ‘రౌడీ ఫెలో’ సినిమా తరువాత కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇదే.

 
Like us on Facebook