కమల్ సినిమాలోకి మళ్ళీ తిరిగొచ్చిన ఇద్దరు హీరోలు

కమల్ సినిమాలోకి మళ్ళీ తిరిగొచ్చిన ఇద్దరు హీరోలు

Published on Apr 16, 2024 1:12 PM IST


ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే దిగ్గజ దర్శకుడు మణిరత్నంల కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కాంబినేషన్ నుంచి మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత చేస్తున్న చిత్రమే “థగ్ లైఫ్”. అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రంలో కమల్ తో పాటుగా మరింతమంది టాలెంటెడ్ నటులు ఉన్నారని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే వీరిలో యుంగ్ నటుడు దుల్కర్ సల్మాన్ అలాగే జయం రవిలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పలు కారణాలు చేత వారు ఈ సినిమా నుంచి తప్పుకునట్టుగా వార్తలొచ్చాయి. దీనితో వారి స్థానంలో మరి నటులు కనిపిస్తారు అని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ తిరిగొచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సినిమా విషయంలో మళ్ళీ అంతా సెట్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా కమల్, ఆర్ మహేంద్రన్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు