బిగ్ బాస్ 5 : హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.?

Published on Nov 28, 2021 12:00 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్ రియాలిటీ షోస్ లో ఒకటైన బిగ్ షో “బిగ్ బాస్” కూడా ఒకటి. నాలుగు సీజన్ల ను కంప్లీట్ చేసుకొని ఐదవ సీజన్లో కూడా మంచి రసవత్తరంగా కొనసాగుతూ వెళుతుంది. అయితే ముందు వాటితో పోలిస్తే కొన్ని ఎలిమెంట్స్ మిస్సయినా కంటెస్టెంట్స్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నారు.

ఇక వారాలు గడుస్తున్నా కొద్దీ ఒక్కో కంటెస్టెంట్ తమ బ్యాగ్ ను సర్దుకుంటున్నారు. ఇక ఈ వారానికి వస్తే ఓ ఊహించని కంటెస్టెంట్ నే ఎలిమినేట్ అయ్యిపోయినట్టు తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు యాంకర్ రవినే.. ఇది ఊహించనిదే అని చెప్పాలి.

అయితే ఖచ్చితంగా రవి పేరు లాస్ట్ టాప్ 5 ఫైనలిస్టులలో ఉంటుంది అని అంతా అనుకున్నారు కానీ ఇలా జరిగితే ట్విస్ట్ అనే చెప్పాలి. మరి ఈరోజు నిజంగానే రవి బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలుగుతున్నాడా లేదా అనేది తెలియాలి అంటే స్టార్ మా లో ఈరోజు రాత్రి 9 గంటలకి ఈ షో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :