ఈ వారం థియేటర్‌లో విడుదలవుతున్న సినిమాలు ఇవే..!

Published on Jun 21, 2022 12:00 am IST

సమ్మర్ అయిపోయింది.. థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ముగిసిపోయింది. ఇక ఇప్పుడు చిన్న సినిమాల హవా మొదలు అయ్యింది. మరీ ఈ వారం థియేటర్‌లో సందడి చేసే సినిమాలేవో ఓ లుక్కేదాం.

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:

సమ్మతమే:

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “సమ్మతమే” గోపీనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

కొండా:

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం “కొండా”. కొండా మురళి-సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ బయోపిక్‌లో సురేఖ పాత్రలో ఇర్రా మోర్‌, మురళి పాత్రలో త్రిగుణ్‌ నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.

7 డేస్‌ 6 నైట్స్‌:

సుమంత్‌ అశ్విన్‌ హీరోగా, ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “7 డేస్‌ 6 నైట్స్‌”. ఈ సినిమా జూన్‌ 24న రిలీజ్‌ అవుతోంది.

చోర్‌ బజార్‌:

ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం “చోర్‌ బజార్‌”. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గెహాన సిప్పీ హీరోయిన్‌. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ జూన్‌ 24న రిలీజ్‌ కానుంది.

గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు:

లక్ష్‌ చదలవాడ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు”. వేదిక దత్‌ కథానాయిక. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

సదా నన్ను నడిపే:

లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ హీరోగా వైష్ణవి పట్వర్దన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం “సదా నన్ను నడిపే”. ఈ సినిమాకు హీరో ప్రతీకే దర్శకుడు కావడం విశేషం. జూన్‌ 24న ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :